ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్‌ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది.

Advertisement

ఓటుకు నోటు కేసుకు సంబందించి మరో అడుగు పడినట్లుగా ఉంది.ఆ కేసులో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్ర రెడ్డికి ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.వారం రోజులలో విచారణకు హాజరుకావాలని ఈడి నోటీసులు తెలిపింది.వరంగల్ లోని నరేంద్ర రెడ్డి ఇంటికి వెళ్లి అదికారులు నోటీసులు అందచేశారు.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ కు ఇచ్చిన ఏభై లక్షల కు సంబందించి ఈడి కూపీ లాగుతున్నట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నరేంద్ర రెడ్డి గతంలో టిడిపిలో ఉన్నారు.