{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578496782478","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578496639765","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సీఎఎ, ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతుగా వరంగల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. “పౌరసత్వ సవరణ చట్టం-2019″కి మద్ధతుగా నగర ప్రజలు జాతీయ జెండాలు, కాషాయ జెండాలతో మహా ప్రదర్శన నిర్వహించారు. హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జాతీయవాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ ఎంపీ బండి సంజయ్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు:

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకించే వారిని బ్రేకుల్లేని బస్సుల్లో పాక్‌కు పంపుతామని హెచ్చరించారు. ‘ద్రోహుల్లారా ఖబడ్దార్‌ ! మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం. మీరు కట్టెలు పడితే, మేం కత్తులు పడతాం. యుద్ధం మొదలైంది ఎవరినీ వదిలేది లేదు. జాతీయ వాదులకు జైళ్లు కొత్త కాదు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు చూస్తున్నారు…

కేసీఆర్‌, ఒవైసీ సోదరుల ఆటలు తెలంగాణలో సాగవు. కేసీఆర్‌, కేటీఆర్‌ యాగం చేసినప్పుడు అసదుద్దీన్‌ హిందుత్వ ఆరోపణలు ఎందుకు చేయలేదు ?, 12 శాతం ఉన్న మైనార్టీల కోసం కక్కుర్తి పడుతున్న నేతలు 85 శాతం ఉన్న హిందువులను పట్టించుకోరా? రంగురంగుల జెండాలు పట్టిన నేతలు, వాటిని వదిలి, కాషాయ జెండా పట్టుకునే సమయం దగ్గర్లోనే ఉందని’ ఆయన వ్యాఖ్యానించారు…