DCCB ప్రత్యేక అధికారిగా కలెక్టర్ అమ్రపాలి
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు DCCB ప్రత్యేక అధికారిగా వరంగల్ రూరల్ కలెక్టర్ అమ్రపాలి కొనసాగనున్నారు. ఈనెల 3వ తేదీతో రాష్ట్రంలోని డీసీసీబీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయిoది. ఐతే పదవీకాలం పూర్తయ్యేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగాలేని ప్రభుత్వం డీసీసీబీలు పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు మాసాలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుని సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.