ఈవీఎంల తీరుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండా సురేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఈనెల 11న జరిగిన కౌంటింగ్‌లో ఒక్క రౌండ్‌లో కూడా తనకు మెజార్టీ రాలేదన్నారు. తనకు ఈవీఎంలపై అనుమానం కల్గుతుందని ఆరోపించారు. కేటీఆర్‌ను గద్దెనెక్కించడానికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్కు పేరుతో 1200 ఎకరాలు కబ్జా చేశారని సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కొండా మురళీ ఆరోపించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, ప్రజల మధ్య ఉండి సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు.