ఈ కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మళ్లీ బంపర్ ఆఫర్లతో వచ్చేస్తున్నాయి. గ్రేట్ ఇండియన్ సేల్ తో అమెజాన్, రిపబ్లిక్ డే సేల్ తో ఫ్లిప్ కార్ట్ రెడీ అయిపోయాయి.

ఫ్లిప్ కార్ట్ సేల్ జనవరి 20 నుంచి 22 వరకు స్పెషల్ డిస్కౌంట్ సేల్ ను ఆఫర్ చేస్తోంది. SBI కార్డు ఉన్న వారికి ఫ్లిప్ కార్ట్ ఆఫర్ తోపాటు అదనంగా మరో 10 శాతం ఇన్ స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, ఇంకా ఎన్నో వస్తువులపై భారీ తగ్గింపును ప్రకటించింది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జనవరి 20 నుంచి 23 వరకు ఉంటుంది. HDFC కార్డు ఉన్న వారికి అమెజాన్ 10 శాతం ఇన్ స్టెంట్ డిస్కౌంట్ ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకే సేల్ స్టార్ట్ అయింది.