ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్ స్కాంలో ఐఏఎస్ అధికారి చంద్రకళపై ఆరోపణలున్నాయని కేసు నమోదు చేశారు. ఆకేసుపై ఏకకాలంలో 12చోట్ల సీబీఐ సోదాలు చేస్తోంది. ఇసుక మాఫియాలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది.

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆమె నివాసంతో పాటు, ఏకకాలంలో దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మైనింగ్ స్కామ్‌లో చంద్రకళపై ఆరోపణలు రాగా, కేసు నమోదు చేసిన CBI సోదాలు నిర్వహిస్తోంది. 2008 బ్యాచ్‌కు చెందిన చంద్రకళ మైనింగ్ స్కామ్‌లో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపణలున్నాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ, దాడులు నిర్వహిస్తోంది. ఐఏఎస్ చంద్రకళ స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా. ఆమె తండ్రి ప్రస్తుతం రామగుండంలో పనిచేస్తున్నారు..