ఐసీయు లో 18Y. బాలికపై అత్యాచారం.
మంటగలుస్తున్న మానవత్వం

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఒంటరిగా ఉన్న బాలికపై అక్కడ పనిచేసే వ్యక్తి, మరో నలుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పొలంలో పనిచేస్తుండగా బాలిక పాము కాటుకు గురవడంతో ఐదు రోజుల క్రితం ఆమెను ఆస్పత్రికి తీసుకురావడంతో ఐసీయూలో చేర్చారు. ఐసీయూలో ఆ రోజు రాత్రి ఇతర రోగులెవరూ లేరు. బాలిక మాత్రమే ఉంది. దీంతో అక్కడ పనిచేసే ఓ వ్యక్తి మరో నలుగురితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ICU నుంచి జనరల్‌ వార్డుకు మార్చిన వెంటనే బాలిక తన బామ్మకు విషయం చెప్పిందని ఎస్పీ ఏ.సింగ్‌ వెల్లడించారు.

Advertisement

రాత్రి తాను ఒక్కదాన్నే ఉన్నప్పుడు యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి, మరో నలుగురు ఐసీయూలోకి వచ్చి తనకు బలవంతంగా ఇంజక్షన్‌ ఇచ్చారని, అడ్డుకోబోతుంటే చేతులు కట్టేసి అత్యాచారం చేశారని బాలిక తన బామ్మకు చెప్పింది. దీంతో ఆమె వైద్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బంది, నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తిని అరెస్ట్‌ చేసి మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఐసీయూలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సీజ్‌ చేశారు. ఇటీవల యూపీలోని భాగ్‌పట్‌లో నర్సింగ్‌ విద్యార్థిపై అత్యాచారం కేసులో వార్డు బాయ్‌ను, మెడికల్‌ విద్యార్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.