తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పగ్గాలు చేపట్టిన యువత నేత కేటీ రామారావు, ఇక జిల్లాలపై ఫోకస్ పెట్టారు, పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన పర్యటనలు కొనసాగనుండగా. ఈ నెల 20వ తేదీన వరంగల్‌లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ పర్యటన కొనసాగనుంది. కార్యానిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్‌కు వరంగల్ లో ఇదే తొలి పర్యటన. టీఆర్ఎస్ పార్టీ వరంగల్ అర్భన్ కార్యాలయం శంకుస్థాపన చేయనున్న ఆయన. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, చైర్మన్ల సమావేశంలో పాల్గొననున్నారు.

రానున్న పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశనం చేయనున్నారు కేటీఆర్.