టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన వరంగల్ నూతన మేయర్ గుండా ప్రకాష్

నూతనంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన గుండా ప్రకాష్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్ గా ఎంపికైన ప్రకాష్ ని కే.టి.ఆర్ అభినందించారు. నూతన మేయర్ తో పాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు పలువురు సీనియర్ నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. ఏకగ్రీవంగా మేయర్ ఎన్నిక ను పూర్తి చేసినందుకు స్థానిక నాయకులతో పాటు పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ బాలమల్లుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ నగర పాలక సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని, ఇందుకోసం స్థానిక కార్పొరేటర్లను అందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని నూతన మెయర్ కి కేటీఆర్ సూచించారు.