అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌ను రెండు సార్లు ఢీకొన్న కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరబోతున్నారు. రేపు కేసీఆర్ సమక్షంలో వంటేరు ప్రతాపరెడ్డి గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.

వంటేరు ప్రతాపరెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌పై పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో తన ఓటమికి కేసీఆర్, హరీష్ రావు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించి ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు వంటేరు. ఇంతకాలం కేసీఆర్ ప్రత్యర్థిగా ఉన్న వంటేరు ప్రతాపరెడ్డి చివరికి ఆయన పార్టీలోనే చేరుతున్నారు. వంటేరు ప్రతాపరెడ్డితో పాటు ఆయన అనుచరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావులతోనూ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది..