KTR వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో లోకేశ్‌కు నిద్ర దూరం
టీడీపీ రాజకీయాలు, మంత్రి లోకేశ్‌పై ఎంపీ, వైసీపీ ప్రధాన కార్యదర్శి వై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణలో కేటీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి లోకేశ్‌కు నిద్రపట్టడం లేదు. తండ్రి అర్జంటుగా తప్పుకొని సీఎం కుర్చీని లేదా పార్టీ బాధ్యతలను తనకు అప్పగిస్తే బాగుండని కలలుకంటున్నాడు.
చంద్రబాబు ఈ విషయంలో కొడుకును కూడా నమ్మడని తెలియదు పాపం చిట్టినాయుడికి – అంటూ ఎద్దేవాచేశారు. AP సర్కారు పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కట్టమూరులో మంత్రి లోకేశ్‌ను మహిళలు తరిమికొట్టారు. వచ్చే మూడునెలలు పచ్చ పార్టీ నేతలకు ఇటువంటి పరాభవాలు తప్పవు. అంటూ వరుస ట్వీట్లలో సెటైర్లు వేశారు.