విద్యార్థులు, పేదలతోపాటు కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలకు పరిష్కరించే TRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌కు ఓ భావోద్వేగ సన్నివేశం ఎదురైంది. ప్రేమించిన వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేశాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి ఆయనతో మొరపెట్టుకుంది. నేలపై కూలబడి భోరున విలపించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం: వనపర్తి జిల్లాకు చెందిన ఆమె కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ అనే యువకుణ్ని ప్రేమించింది. త్వరలో పెళ్లి చేసుకుంటానని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో అంగీకరించాడు. అయితే ఆ మాట ఇచ్చి ఏడాది గడిచినా పెళ్లి చేసుకోవడం లేదు. దీంతో ఆమె ఈ రోజు తెలంగాణ భవన్ వద్దకు వచ్చి తన కేటీఆర్‌కు సమస్యను వివరించింది. కేటీఆర్ వెంటనే స్పందించి, ఆమె సమస్యను పరిష్కరించాని టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలకు చెప్పారు…