ప్రపంచాన్ని మార్టే శక్తి , కొత్త ప్రపంచాన్ని సృష్టించగల సత్తా యువతరానికే ఉంది . యువత ఒక్కచోట చేరితే వారిలోని సృజనాత్మకత బయటకు వస్తుంది . నిట్ లో జరుగుతున్న వసంతోత్సవం వారి కళ లను వెలుగులోకి తెస్తున్నది . గో-గ్రీన్ పేరిట మొక్కల పెంపకం , క్విజ్ , డ్యాన్స్ , ఆటలు , పాటలు , వంటలు , ఆర్ట్ , ఫన్నీ గేమ్స్ . . ఇలా ఒక్కటేంటి . . విద్యార్థుల ఆలోచనలను ‘ నిట్ కళాక్షేత్ర స్ప్రింగ్ – స్ప్రీ – 19° బయటకు తెచ్చింది . శనివారం రెండో రోజు పలు కార్యక్రమాలతో సందడి నెలకొంది ..

సంగీత విభావరి

ఎస్ఎస్ థమన్ . . యువ సంగీత కెరటం తన హుషారైన పాటలతో విద్యార్థులతో స్టెప్పులేయించాడు . రేసుగుర్రం , తొలిప్రేమ , బ్రూస్లీ , నాయక్ , అరవింద సమేత తదితర బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల గీతాలతో ఆకట్టుకున్నాడు . వేలాదిగా విద్యార్థులు , నిట్ ఉద్యోగులు తమన్ లైవ్ షోను ఆసక్తిగా తిలకించారు . అనంతరం లేజర్ షో ధీమ్ ప్రదర్శించారు .