శనివారం మరో ఆర్టీసీ కండక్టర్‌ గుండెపోటుతో మృతి చెందాడు.

మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. శనివారం మరో ఆర్టీసీ కండక్టర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. హన్మకొండ డిపో కండక్టర్‌ రవీందర్‌ మూడు రోజుల క్రితం టీవీ చూస్తూ కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం రవీందర్‌‌ను ఆసుపత్రికి తరలించారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్‌ మృతి చెందాడు.

రవీందర్ స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు. రవీందర్‌ మృతితో పెద్ద ఎత్తున ఆందోళనలకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లా మల్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మల్యాలలో నిర్వహించిన ధర్నాలో శ్రీనివాస్‌ కుప్పకూలి కిందపడ్డాడు. వెంటనే శ్రీనివాస్‌ను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.