టి.ఆర్.యస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టి.ఆర్.యస్ అభ్యర్థిగా పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటించారు, అభ్యర్ధిత్వం కోసం తెరాస పార్టీ సినియర్ నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు చివరి వరకు వినిపించినా అధిష్టానం శ్రీనివాస్ రెడ్డి వైపు మొగ్గు చూపింది…

మరో ఈద్దరిని కుాడ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పట్నం మహేందర్ రెడ్డి (రంగారెడ్డి) , తేరా ప్రతాపరెడ్డి (నల్లగొండ) లను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. తుది కసరసత్తు కోసం ఏడుగురు మంత్రులతో సీఎం కేసీఆర్ ఆదివారం చర్చించారు. ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, జగదీశ్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో భేటీ అయ్యారు. శుక్రవారం సీఎం కేసీఆర్ చెన్నై పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అభ్యర్థుల కసరత్తును వేగవంతం చేశారు…