వరంగల్: పట్టణానికి చెందిన జర్నలిస్టు కూతురు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. గోవాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో సీనియర్ వీడియో జర్నలిస్టు ఎండి నయీమ్ కూతురు ఆసియా పాల్గొంది. ఈ క్రమంలో రెండు బంగారు పతకాలు సాధించి తనేంటో నిరూపించుకుంది. ఈ సందర్భంగా నగరంలోని పలువురు ఆసియాకు అభినందనలు తెలుపుతున్నారు.