గుంటూరు చెందినటు వంటి శ్రీనివాసరావు బీటెక్ పూర్తి చేసి మోటో కంట్రోలర్ మెకానిక్ గా వర్క్ చేస్తున్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సమయంలోనే రెవేన్యూ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి ద్వారా సంబంధం ఉందని తెలుసుకొని, అమ్మాయి ప్రియాని చూసి వచ్చాడు. చివరికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. అమ్మాయికి తండ్రి లేడు. దీంతో చలించిపోయిన శ్రీనివాస్ కట్నం ఏమీ తీసుకోకుండా, అమ్మాయికి రెండు లక్షల రూపాయలు పెట్టి బంగారం పెట్టాడు. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి బంధుమిత్రులందరిని పిలిచాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

ఇక ప్రియా మాత్రం ఏదో ఒక సాకు చెప్పి ప్రతిరోజు శ్రీనివాస్ ను దగ్గరకు రానివ్వకుండా దూరంగా పెట్టసాగింది. ఈ తరుణంలోనే తన తల్లి ఆరోగ్యం బాగా లేదని చెప్పి పుట్టింటికి వెళ్ళింది. మూడు నెలలైనా ఇంటికి రాలేదు. ఏం జరిగిందని భర్త ఆరా తీస్తే, ప్రియాకు గతంలోనే ఒక యువకుడితో పెళ్లి జరిగిందని తెలిసింది. శ్రీనివాసు ఒక్కసారిగా కంగుతిన్నాడు. యువతి మోసం చేసిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.