తొలి సినిమా నుంచే తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసుకోగలిగింది సమంత. అలాగే అక్కినేని కుటుంబాన్ని కూడా తన మాయలో పడేసుకుని ఆ ఇంటికి కోడలైంది. పెళ్ళికి ముందు నుంచే గ్లామర్‌ పాత్రలు తగ్గించుకున్న సమంత పెళ్ళి తరువాత మరింత పద్ధతిగా నటిస్తోంది. ఒక్కో సినిమాకి తన మెట్టును పెంచుకుంటూ పోతున్న సమంత ప్రస్తుతం సినిమాలు తగ్గించుకుంటోందన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. తల్లి కావాలనే ఆలోచనతోనే కొంత కాలం సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాలని చూస్తోందట. తల్లి కావడానికి అవసరమైన ఆరోగ్య చిట్కాలను కూడా పాటిస్తోందట. మాతృత్వం కోసమే సినిమాలకు సమంత దూరమయిందన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయం సమంతని అడిగితే మాత్రం ఏవేవో డేట్స్ చెబుతూ అప్పుడు తల్లినవుతానంటూ అందరినీ ఆటపట్టిస్తుందీ అమ్మడు.

చైతన్య, సమంతల కోసం ఓ వీరాభిమాని:

అక్కినేని నాగ చైతన్య, సమంతల కోసం ఓ వీరాభిమాని మోకాళ్ళపై సింహాచలం మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నవంబర్ 23న నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా బొబ్బిలికి చెందిన సాగర్ అనే వీరాభిమాని మోకాళ్ళపై సింహాచలం మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నాగ చైతన్య నిండు నూరేళ్లు చక్కగా ఉండాలని ‘హ్యాపీ బర్త్ డే చైతు బంగారం’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అలాగే సమంత మేడం కూడా క్షేమంగా ఉండలని వాళ్లకు తప్పకుండా బాబు పుట్టాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై స్పందించిన నాగ చైతన్య నవీన్ ఏమి చెప్పాలో అర్ధం కావడం లేదు నీ ప్రేమకు ధన్యవాదములు అని ట్వీట్ చేశాడు. అలాగే సమంత సైతం స్పందిస్తూ : ఇది నమ్మలేక పోతున్నానని, మాటలు రావడం లేదని, దయచేసి మమ్మల్ని కలవండి అంటూ ట్వీట్ చేసింది…