ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియా ద్వారా అనేక విష‌యాలు పంచుకుంటూ ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారాల‌కి సంబంధించి రేణూ క్లారిటీ ఇచ్చారు. మ‌హేష్ సినిమాలో తాను కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌ని ఖండించారు. ఇది బేస్‌లెస్ రూమ‌ర్. ఇంత పెద్ద సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌స్తే నేనే అనౌన్స్ చేస్తాను. ఓ సంద‌ర్భంలో మ‌ద‌ర్ రోల్‌లో న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇలాంటి వార్త‌లు సృష్టించారు అని రేణూ పేర్కొన్నారు.

ఇక ఎప్ప‌టి నుండో వినిపిస్తున్న అకీరా వెండితెర ఎంట్రీపై కూడా రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అకీరా వ‌య‌స్సు ఇప్పుడు 16 ఏళ్ళు మాత్ర‌మే. వాడికి చాలా జీవితం ఉంది. మంచి మ‌నిషిగా ఉండడం ముఖ్య‌మ‌ని అకీరాకి చెబుతాను. అకీరా ఏ వృత్తిని ఎంచుకున్నా నా సపోర్ట్ ఉంటుంది. వాళ్ల నాన్న, పెద్దనాన్న, అన్న హీరోలు అనే ఆలోచనతో తాను కూడా హీరో అయిపోవాలనే ఒత్తిడి తీసుకోవద్దని చెప్తాను. ఏది ఇష్ట‌మైతే అదే చేయ‌మ‌ని , ఎల్ల‌ప్పుడు నా స‌పోర్ట్ ఉంటుంద‌ని అకీరాకి చాలా సార్లు చెప్పాను అని రేణూ స్పష్టం చేసింది.