తాత్కాలిక మార్కెట్ కై వినియోగించుకున్న అజంజాహి మిల్ గ్రౌండ్ లో అగ్నిప్రమాదం.ఎగిసిపడుతున్నా మంటలు. పక్కనే భారత్ పెట్రోలియం కంపెనీ ఉండటంతో భయాందోళనలో ప్రజలు.

అజాంజాయి మిల్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాద ఘటన స్థలికి చేరుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

అజాంజాయి మిల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో అగ్నిప్రమాదం సంభవించిందనే విషయం తెలుసుకుని వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతుతో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో మరియు ఎలక్ట్రిక్ సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడారు. మంటలు ఎలా వ్యాపించాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మంటలు అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు అప్రమత్తంగా ఉండాలని, ఏమరపాటు వద్దని ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం అయినందున పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని ఎమ్మెల్యే అదికారులకు సూచించారు. స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ అదికారులకు సూచనలు చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పోరేటర్ సోమిశెట్టి శ్రీలత ప్రవీణ్, నాయకులు, స్థానికులు ఉన్నారు.