ఫోన్ లో పరిచయమైన 17ఏళ్ల కుర్రాడితో 35ఏళ్ల ఆమె ప్రేమలో పడింది. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారిరకంగా లొంగిపోయింది. ఇద్దరు పలుమార్లు చాలా దగ్గరయ్యారు కానీ ఇప్పుడు ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ ఏం జరిగింది.? ఓ 17ఏళ్ల కుర్రాడు, 35ఏళ్ల మహిళ తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అసలు 17ఏళ్ల కుర్రాడిని ఆమె ఎలా నమ్మింది.? పరిచయం లేని అతడితో ప్రేమలో ఎలా పడింది.? మైనర్ బాలుడితో పెళ్లికి ఎలా సిద్ధమైంది.? అంటే సమాధానం లేని ప్రశ్నే, మరీ దారుణం ఏంటంటే, ఆ 35ఏళ్ల మహిళను 17ఏళ్ల కుర్రాడు పలు మార్లు అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి పేరు చెప్పి తనను లోబరుచుకున్నాడని ఇప్పడు పెళ్లి చేసుకుందాం అంటే మోసం చేశాడని ఆమె పోలీసుల దగ్గర రోధించింది. అలా పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఇప్పటి వరకు తన నుంచి పలు మార్లు డబ్బులు కూడా తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్‌లో జరిగింది. ఆ కుర్రాడు మాత్రం తననే మహిళ మోసం చేసిందని మాయ మాటలు చెప్పి తనను వాడుకుంది అంటూ ఆరోపిస్తున్నాడు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం: జాష్పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధిత మహిళ బాలుడిపై అత్యాచారం కేసు పెట్టిందంటున్నారు. తనకు ఆ బాలుడితో ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయంలో బాలుడి మాటలు చాలా నచ్చాయని తనకు అన్ని విధాలా అండగా ఉంటనని నమ్మించాడని దీంతో తమ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని ఆమె పోలీసులకు చెప్పారు.

ప్రేమ పేరుతో దగ్గరైన ఆ కుర్రాడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి శారీరకంగా కూడా దగ్గరయ్యానని ఆమె చెప్పింది. అలాగే తన నుంచి చాలా సార్లు డబ్బులు కూడా తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడం మొదలుపెట్టిన తర్వాత సదరు బాలుడు తనకు కనిపించడం మానేశాడని, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని బాధిత మహిళ తెలిపింది. అలాగే తన నుంచి తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని చెప్పింది. ఆమె చెప్పింది విని కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని బాలల వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. బాధిత మహిళ మాత్రం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.