వారిద్దరూ భార్యాభర్తలు ఎన్నో ఏళ్ల దాంపత్య జీవితం వారిది. కానీ, వారి మధ్య అనుమానం అనే పెనుభూతం దరిచేరడంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై అనుమానంతో ఏ భర్త చేయకూడని విధంగా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. చివరకు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌‌పై దాడి చేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. చిత్రహింసలు భరించలేక సదరు మహిళ ఓ పోలీసు అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం: సింగ్రౌలి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి(64) తన భార్య(55)కు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఓ రోజు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. భర్త చిత్రహింసలను భరించలేక ఆ మహిళ పోలీసు అధికారిని ఆశ్రయించింది.

దీంతో పోలీసులు మహిళను ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కేంద్రానికి తరలించారు. ఈ సందర్బంగా పోలీసు అధికారి మాట్లాడుతూ: నిందితుడు మహిళ ప్రైవేటు భాగాల్లో దాడి చేసేందుకు సూది, దారాన్ని ఉపయోగించాడని తెలిపారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక, నిందితుడిపై శారీరక, మానసిన వేధింపులతో పాటు సంబంధిత సెక్షన్ల కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు..