పెదనిండ్రకొలను ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతిపై అదే ప్రాంతానికి చెందిన కడగళ్ల రాజేష్‌ అనే యువకుడు అత్యాచారం చేసి హత్యాయత్నం చేసాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న నిందితుడు ఆమెని గోతిలో పాతిపెట్టి దర్జాగా వెళ్ళిపోయాడు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు మట్టి తొలగించుకుని ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు పెదనిండ్రకొలను పీహెచ్‌సీలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయింది. విషయం తెలిసి బంధువులు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో తండ్రితో కలిసి వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని పట్టుకునే పనిలో ఉన్నారు.