ఏంటి ! ఈ మాటలు అన్నది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చనా? అనే కదా మీ డౌట్. అవును అక్షరాలా ఈ మాటలు అన్నది అమితాబ్ బచ్చనే. కానీ ఇప్పుడు కాదులెండి. అప్పుడెప్పుడో 30 ఏళ్ళ కిందట ఆయన అన్న మాటలు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ విషయంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్లుబుకుతున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఇప్పటికే వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా దిశ నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో 30 ఏళ్ళ కిందట ‘మూవీ’ అనే మ్యాగజైన్ మీద అమితాబ్ అన్న మాటలు ముద్రించారు. ఇంతకీ ఆయనేమన్నాడంటే ? అత్యాచారం తప్పదనప్పుడు వెనక్కి పడుకొని దాన్ని ఎంజాయ్‌ చేయటమే అంటూ అమితాబ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన్నువెంటాడుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం దిశ ఘటన కుదిపేస్తుండటంతో అమితాబ్ పాత వ్యాఖ్యలు తెహ్రాపైకి వచ్చాయి. అప్పటి న్యూస్ ను రీ ట్వీట్ చేస్తూ సూపర్ స్టార్స్ ఇలా చెప్తుంటే ఇక అత్యాచారాలు ఎలా ఆగుతాయంటూ మండిపడుతున్నారు యువత. అప్పట్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బీ టౌన్ ను ఏలుతున్న సమయంలో ఆవేశంలో బచ్చన్ సార్ అన్న మాటలు ఇప్పుడు మళ్ళీ వివాదాస్పదంగా మారాయి. మరి దీనిపై అమితాబ్ ఎలా స్పందిస్తారో చూడాలి…