ఇటీవల హన్మకొండలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి శ్రీహిత తల్లితండ్రులను రాష్ట్ర హోం మంత్రి శ్రీ
మహమూద్ అలీ ఆదివారం ఉదయం ఫోన్ లో పరామర్శించారు.కన్నీరు మున్నీరు అవుతున్న ఆ తల్లితండ్రులను ఆయన ఓదార్చారు. ఘోరానికి పాల్పడిన ఆ దుర్మార్గుడిని కటినంగా శిక్షిస్తామని వారికి మాటిచ్చారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్ల్యే శ్రీ దాస్యం వినయ్ వినయ్ భాస్కర్ ఆదివారం ఉదయం హన్మకొండలోని శ్రీహిత
ఇంటికి వెళ్ళారు.ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా తాను శనివారం హైదరాబాద్ వెళ్లి హోం మంత్రిని కలిసి సంఘటన గురించి మంత్రి గారికి వివరించి , దోషిని శిక్షించాలని కోరుతూ వినతి పత్రాన్ని సంర్పించాననీ,దానిపై మంత్రి తక్షణం స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని కుటుంబ సభ్యులకు వివరించారు.అంతే కాకుండా అప్పటికప్పుడు అక్కడి నుంచే మంత్రి గారికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. వారితో మాట్లాడిన మంత్రి ఆ కుటుంబాన్ని ఓదార్చి,ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటుందనీ,చేయూత నందిస్తుందనీ హామీ ఇచ్చారు.
ఆ తర్వాత ఎమ్మెల్ల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీయార్ గారికి కూడా వివరించాననీ,11 రోజుల కార్యక్రమం పూర్తయ్యాక కుటుంబ సభ్యులను తీసుకొని హైదరాబాద్ రామ్మన్నారనీ, పార్టీ తరఫున ఆ కుటుంబానికి పూర్తీ అండదండలు అందిస్తామని హామీ ఇచ్చారనీ, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారనీ చెప్పారు…