ఎక్కడి నుండి వచ్చిందో ఉన్నని రోజులు ఎలా బ్రతికిందో తెలీదు చివరికి అలా దుర్భర స్థితిలో దుండగుల చేతిలో మరణించింది.గత పది రోజుల క్రితం కొండగట్టు సమీపంలో గుర్తు తెలియని 20-25 సంవత్సరాల యువతి హత్యకు గురైంది.మృతదేహాన్ని గమనించిన అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు స్వాధీనం చేసుకొని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.కాగా పది రోజులు అయినప్పటికీ మృతదేహానికి సంబంధించిన వారు ఎవరు రాలేదు.దీంతో మృతదేహం రోజురోజుకీ కుళ్ళిపోవడంతో పోలీసులు జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ వారికి సమాచారం అందించగా స్పందించిన మేము తనకు అన్నలుగా ముందుకొచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లి మోతె స్మశానవాటికలో ఖననం చేయడం జరిగింది.

అనంతరం చనిపోయిన ఆ చెల్లి ఆత్మ శాంతికై మౌనం పాటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు డెక్క శ్రవణ్,సింగం భూమేష్,నల్ల నరేష్,నల్ల సురేష్,కడమండ వంశీ,చెక్కబండి కార్తీక్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మాట్లాడుతూ ఆ యువతి మృతికి కారకులైన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. చెల్లె నీలాంటి చావు మరెవరికి రాకూడదు అని ఆ భగవంతున్ని వేడుకుంటున్న, నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… మీ అన్నయలు(జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్)