మహాభారతంలో ద్రౌపది పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పంచ పాండవులందరికీ ఆమె ఉమ్మడి భార్య. అసలు అన్మదమ్ములందరికీ ఒకటే భార్య ఎలా అని ఆలోచన రావచ్చు. అందుకో కథ చెబుతారు. అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నప్పుడు తమాషాగా అమ్మా నేనో పండు తెచ్చాను అని తల్లి కుంతికి అసలు విషయం చెప్పకుండా తమాషాగా అంటాడు. అయితే అంతా కలసి పంచుకోండి నాయనా అంటుంది కుంతి. దాంతో తల్లిమాట జవదాటలేక, ఐదుగురు పాండవులూ ద్రౌపదిని భార్యగా స్వీకరిస్తారు.

అయితే అది పురాణాం కానీ ఇలాంటి వింత ఆచారం ఇంకా మన భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోందట. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ ప్రాంతంలోని కొండ జాతుల్లో ఇంకా ఈ ఆచారం ఉందట. ఆ జాతుల్లో అన్నదమ్ములంతా ఒకే అమ్మాయిని చేసుకుని కాపురం చేస్తారట. ఇది ఇప్పటి ఆచారం కాదట. మహాభారత కాలం నుంచి ఇదే ఆచారం పాటిస్తున్నాయని కొన్ని గ్రామాలు. పురాణాల్లో అంటే ఓకే కానీ ఈ కాలంలో ఎలా ఈ ఆచారం అమలవుతోందని ఆశ్చర్యపోతున్నారా కొన్ని వింతలు అంతే.

సరే మరి ఇంతమంది భర్తలతో ఆ భార్య సంసార జీవితం ఎలా అన్న అనుమానం రావచ్చు. అందుకు కూడా ఆ గిరిజన తెగల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయట. ఎప్పుడు ఎవరితో శృంగారం చేయాలనేది ఆ భార్య ఇష్టాఇష్టాలకే వదిలేస్తారట. ఆమె అభిప్రాయం ప్రకారమే అన్నదమ్ములంతా నడుచుకుంటారట. ఇలా చేస్తే ఆ ఇంట సిరిసంపదలు నిలుస్తాయన్నది వారి నమ్మకం. అవును అదీ నిజమే కదా అన్నదమ్ములంతా కలసి సంపాదిస్తారు.. ఒక కుటుంబంగానే జీవిస్తారు. మరి అంతా ఆదాయే కదా. అయితే ఇది ఆదాయం కోసం కాకపోయినా.. తరతరాలుగా వస్తున్న ఆచారం అలా కొనసాగుతోంది. ఇక అన్నదమ్ముల మధ్య భార్య గురించి ఏదైనా తేడా వస్తే ఆ గ్రామ పెద్ద ఆ పంచాయతీ తీరుస్తాడట. అలా ఇంకా మహాభారతం నాటి ద్రౌపదులు.. ఇంకా ఈకాలంలో కూడా ఉన్నారన్నమాట.