
హైదరాబాద్: డబుల్ బెడ్రూం గృహాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కొంత మంది దళారులు డబుల్ బెడ్రూం గృహాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
అధికారుల సంతకాలు సైతం ఫోర్జరీ చేసి గృహాలు అలాట్ అయినట్లు దొంగ సర్టిఫికేట్లు సైతం సృష్టించి ప్రజలను మోసగిస్తున్నట్లు తెలిసిందని, అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలను మోసగిస్తే వారికి కఠిన శిక్ష తప్పదన్నారు, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.