మహబూబాబాద్: అబార్షన్లకు సహకరిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని, క్రిమినల్ కేసు కూడా పెడతామని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ హెచ్చరించారు.‌‌ కేసముద్రం మండల పర్యటన లో భాగంగా ఇనుగుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. హాస్పిటల్ లో సౌకర్యాల పై వైద్య సిబ్బంది ని ప్రశ్నించారు.‌‌రికార్డ్ లను పరిశీలించారు. హాస్పిటల్ లో జరుగుతున్న ఏ.ఎన్. ఎమ్. శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ‌కాన్పుల సంఖ్య తక్కువగా ఉండడంతో వైద్య సిబ్బందిని మందలించారు. ఒక్కొక్కరు ఒకరిని లక్ష్యంగా పెట్టుకున్న కాన్పుల సంఖ్య పెరిగేదని అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల పుట్టుక ను అడ్డుకుంటే జైలు పాలు కాక తప్పదన్నారు. అకారణంగా అబార్షన్లు చేయిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని, క్రిమినల్ కేసు ఫైల్ చేయిస్తానన్నారు.ఆడయిన, మగ అయిన సమదృష్టితో చూడాలని సామాజిక బాధ్యతగా పనిచేయాలన్నారు.