హిజ్రాగా మారిన ఓ యువకుడు, తల్లిదండ్రులు తనకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోడానికి డబ్బులివ్వలేదన్న కారణంతో అందర్నీ కాల్చి చంపేశాడు. 20ఏళ్ల అభిషేక్ మాలిక్ తండ్రి ప్రదీప్ మాలిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొడుకు అభిషేక్ మాలిక్ శరీరంలో జరుగుతున్న మార్పుల్ని మొదట్లో వారు కనుక్కోలేకపోయారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో అభిషేక్ తనకు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని కోరికగా ఉందని, తల్లికి చెప్పేవాడు. ఆడపిల్లగా మారాలన్న కోరిక బలంగా ఉందని, చెప్పినప్పుడు వాళ్లు దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత తన కోర్కెను వ్యక్తం చేసి 5లక్షల రూపాయలు డబ్బులు కావాలని కూడా అడిగాడు. మరోవైపు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడన్న విషయానికి కూడా కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలిసింది. గే ఫ్రెండ్స్ కి ఇంట్లో డబ్బులు కూడా తీసుకెళ్లి ఇచ్చేవాడు.

ఈ పరిణామంలో హిజ్రా స్నేహితుల ప్రోద్బలంతో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలన్న గట్టి నిర్ణయానికి వచ్చి, తల్లిదండ్రుల్ని డబ్బులు అడిగాడు. వారు డబ్బులు ఇవ్వకపోవడంతో తుపాకీతో తండ్రిని, తల్లిని, చెల్లిని అమ్మమ్మను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత ఒక హోటల్ కి వెళ్లి గది అద్దెకు తీసుకుని అక్కడ ఉండిపోయాడు. అభిషేక్ మేనమామ ఉదయమే ఇంటికొచ్చి జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం దారుణం బయటకొచ్చింది.