అభిమాని ప్రేమను చూసి ప్రభాస్ ఫిదా అయ్యాడు. ఆ అభిమానికి కబురుపెట్టాడు. తన వద్దకు పిలిపించుకున్నాడు అభిమానితో కాసేపు మనసు విప్పి మాట్లాడాడు. అనంతరం అభిమానికి ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్. ఒకప్పుడు ఇలియానా అంటే పడి చచ్చిపోయే వారు. తెలుగులో ఆమె పాపులారిటీని దర్శక నిర్మాతలు కూడా షాక్ అయ్యారు. దశాబ్దం క్రితమే కోటి రూపాయల పారితోషకం తీసుకుందని, టాలీవుడ్‌లో అప్పటికి అదే హయ్యస్ట్ అని చెప్పుకునే వారు. పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఇలియానా క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. కొన్నిరోజులు హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా సినిమాలు చేస్తూనే వచ్చింది. అయితే మధ్యలో ఇలియానా బాలీవుడ్ బాట పట్టేసింది. అక్కడ బోల్తా కొట్టడంతో తిరిగి టాలీవుడ్‌కు వచ్చింది. కానీ ఇక్కడా కూడా అదే ఫిలితం రిపీట్ అయింది. అయితే ఇప్పుడు మాత్రం టాలీవుడ్ పూర్తిగా ఇలియానాను పక్కన పెట్టేసింది. బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నా కూడా హిట్ మాత్రం రావడం లేదు. ఇలియానా ప్రస్తుతం తన ఫిట్నెస్ మీద దృష్టిపెట్టేసింది. నిత్యం వర్కవుట్లతో ఇలియానా బిజీగా ఉంటుంది.

తాజాగా ఇలియానా తన వర్కవుట్ల గురించి, ట్రైనర్ గురించి చెబుతూ కన్నీరు పెట్టేసుకుంది. ఇలాంటి ఘటన ఎప్పుడూ ఇది వరకు జరగలేదు. వర్కవుట్లు అయిన తరువాత కాస్త ఎమోషనల్ అయ్యాను. కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు చేతులు నీ దగ్గర పెట్టుకుని నీ బాడి గురించి నువ్ ఆలోచించుకో నీ కోసం నీ శరీరం ఎంత కష్టపడుతోందో ఫీల్ అవ్వు అని ట్రైనర్ చెప్పాడు. అవును అది నిజమే కదా? అని నాకు అనిపించింది. అలా చేసిన తరువాత నా బాడీ గురించి నేను ఆలోచించుకున్నాక ఎంతో సంతోషం వేసింది. మీరు కూడా ఓ సారి అలా చూసుకోండి అని ఇలియానా చెప్పుకొచ్చింది.