మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి మద్దతును జనసేన , పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. చిరంజీవి ఇచ్చిన ప్రకటన నిజమేఅయినా , దానిని నమ్మడంలేదు. చిరంజీవి ప్రకటనతో జగన్ కు చిరు పూర్తిస్థాయిలో అండగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని చిరు చెప్పడంతో , గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలను అయన తిప్పికొట్టినట్టు అయింది. .

‘‘అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే రూ.3లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ.లక్ష కోట్ల అప్పుతో రాజధాని అమరావతి నిర్మిస్తే .. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలో ఉంటుంది అన్న చిరు మాటలు జనసేనకు ఇబ్బందిగా పరిణమించాయి. చంద్రబాబు కంటే పవన్ కల్యాణే ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న దశలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని చెప్పడంకూడా తమ్ముడు పవన్ మాటలను చిరంజీవి ఖండించినట్టు అయింది. సాగు, తాగునీరు, ఉపాధి లేక ఊళ్లు విడిచి వలస వెళ్తున్నారు. నిరుద్యోగులకు మూడు రాజధానుల ప్రతిపాదన భద్రతనిస్తుంది అని కూడా చిరు ఇచ్చిన ప్రకటన విశేషం..