జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా సమితి ఆద్వర్యంలో అమెరికా లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా, జార్జ్ ఫ్లాయిడ్ అమానుష హత్యను ఖండిస్తూ, ప్లకార్డులు చేబూని నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయిప్సో జిల్లా అద్యక్షులు భీమనాదం శ్రీనివాస్, జూలియన్ సీజర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నేదునూరి శ్రీహరి, ఈ. వేణుగోపాల రావు, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ మార్క శంకర్ నారాయణ, ప్రభాకర్ కార్యదర్శులు తోట సుధాకర్, ఎండి ఉస్మాన్ పాషా తదితరులు పాల్గొన్నారు