చికాగోలో దారుణం జరిగింది, హైదరాబాద్ కు చెందిన విద్యార్ధిని అమెరికాలో దారుణహత్యకు గురైంది. శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన రూత్ కాలేజీ సమీపంలోని గ్యారేజీలో తన సొంతకారు బ్యాక్ సీటులో విగతజీవిగా కనిపించింది.

హైదరాబాద్‌కు చెందిన తెలుగు యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. రూత్ జార్జ్ అనే 19 ఏళ్ల యువతి చికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీలో చదువుతుంది. శుక్రవారం కాలేజీకి వెళ్లిన జార్జ్ మళ్లీ ఇంటికి రాలేదు. దాంతో ఆమె కటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో జార్జ్ మృతదేహాన్ని కాలేజీ క్యాంపస్‌లో కార్ గ్యారేజీలో ఉన్నఆమె సొంత కారులోని వెనుక సీటులో గుర్తించారు..

జార్జ్‌ని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా జార్జ్ రాత్రి 1:35 నిమిషాలకు కార్ గ్యారేజీకి వెళ్తున్నట్లుగా రికార్డయింది. అందులో డోనాల్డ్ తుర్‌మాన్ అనే పాత నేరస్తుడు ఆమెను ఫాలో చేస్తున్నట్లుగా గుర్తించారు. అతడే జార్జ్‌ని అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. తుర్‌మాన్‌ని అదుపులోకి విచారిస్తున్నారు. రూత్ జార్జ్ మరణంతో యూనీవర్సిటీ క్యాంపస్‌లో విషాదం నెలకొంది…