• అమెరికాలో మెరిసిన వరంగల్ తేజం
  • నూతన అప్లికేషన్ ఆవిష్కరణతో
  • ఫేస్ బుక్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం.

వరంగల్ నగరానికి చెందిన అజిత్ కుమార్ గందే అమెరికాలో ఓరుగల్లు పేరు ప్రతిష్టలను ఇనుమడింప జేశారు. తన ప్రజ్ఞాపాటవాలతో ‘ క్లౌడ్ మోడి ఫికేషన్ ఆఫ్ మ్యాడ్యూలర్ అప్లికేషన్ రన్నింగ్ ఇన్ లోడర్ డివైజెస్ ‘ అనే సరికొత్త ఆవిష్కరణ చేసి యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ హక్కును సాధించడంతో పాటు ప్రపంచలోనే పేరొందిన ఫేస్ బుక్ సంస్థలో ఉన్నత మైన ఉద్యోగాన్ని పొందినట్లు ప్రముఖ చార్గెట్ అకౌంటెంట్ పీవీ.నారాయణరావు తెలిపారు. అజిత్ గతంలో మైక్రోసాఫ్ట్ సంస్థలో వివిధ రం గాల్లో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. సరికొత్త డివైజ్ ను కనిపెట్టి ఉన్నత ఉద్యోగం పొందిన అజిత్ గందేను. ఆయన తండ్రి సీఏ ఉమాశంకర్, సీఏ యశోదానారాయణ అభినందించారు .