ఇటీవ‌లె ఓ ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే ఓ యువ‌తి త‌న త‌ల్లికి ప్రేమ‌తో ఒక ఉత్త‌రాన్న రాసి మ‌రి ఆత్మహ‌త్య చేసుకుంది. ఆ ఉత్త‌రం చేస్తే ఎటువంటి వారికైనా స‌రే క‌న్నీళ్ళు ఆగ‌వు. మ‌రి ఇంత దారుణ‌మైన ఒక సంఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే:

అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు. నాకు బతకాలని ఉంది, కానీ బతకనివ్వట్లేదు వాడు, తన గదికి రావాలంటున్నాడు. రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. ఆ యువకుడిని ఏమీ చేయవద్దు. ఆ ఫొటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఐలవ్‌యూ అమ్మా. ఐ మిస్‌యూ అమ్మా, చనిపోయే ముందు ఓ యువతి రాసిన లేఖ ఇది. నాకు బతకాలని ఉంది వాడు బతకనివ్వట్లేదు అని రాసింది చదివితే ఎవరికైనా కన్నీరు వస్తుంది.

ఓ యువకుడు తనను రూమ్‌కు రమ్మని వేధించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ ఉత్త‌రంలో పేర్కొంది. చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖ పోలీసుల‌కు చిక్కింది. అయితే ఆ వేధింపుల‌కు కార‌ణ‌మైన ఆ యువ‌కుడు అస‌లు ఎవ‌రు అనేది తెలియ‌డం లేదు. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఏత‌ప్పు చేయ‌ని ఆ యువ‌తి ఎందుకు భ‌య‌ప‌డింది. పోలీసుల‌కు క‌నీస స‌మాచారాన్ని ఎందుకు ఇవ్వ‌లేదు. అలాగే ఏవో ఫొటోలు బ‌య‌ట‌పెడ‌తాన‌న్నాడు అన్న విష‌యాన్నిత‌ను లేఖ‌లో రాసింది. ఒక‌వేళ వారిద్ద‌రి మ‌ధ్య ఎటువంటి త‌ప్పు జ‌ర‌గ‌క‌పోతే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి ఆ ఫొటోలేంటి అస‌లు ఆ క‌థేంటి అన్న‌ది మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోప‌క్క మ‌హిళా సంఘాలు నిందిడి జాడ తెలుసుకుని క‌ఠినంగా శిక్షించాలంటూ ప‌లు మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.