నిత్య పెళ్లికొడుకుగా మారిన ఒక ప్రధానోపాధ్యాయుడి గుట్టురట్టయింది. శీలం సురేష్‌ అనే ప్రధానోపాధ్యాయుడు ముగ్గురు యువతలను మోసం చేసి వివాహం చేసుకున్నాడు. 2011లో గుంటూరుకు చెందిన శాంతిప్రియతో, 2015లో ఉయ్యూరుకు చెందిన శైలజతో, 2019లో విశ్వనాథపల్లికి చెందిన అనూషతో ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు. రెండో భార్య శైలజ ఫిర్యాదుతో నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడింది. దీంతో దిశా పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువతులను మోసం చేసిన ప్రధానోపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.