• ఫౌండేషన్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జాతీయ సేవా పురస్కారం.
  • మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్.

ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ, ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ కష్టాలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్న అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ కి అరుదైన గుర్తింపు లభించింది. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను జాతీయ సేవా పురస్కారం వరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు, క్రీడాకారులకు, ఎంతో మంది నిరుపేద ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ కు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ సేవా పురస్కారాన్ని ప్రకటించింది.

ఈ పురస్కారాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హన్మకొండలోని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి నివాసంలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఫౌండర్, టీఆరెఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి, చైర్మన్ అరూరి విశాల్ గారికి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గారు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ అందిస్తున్న సేవలను తెలుసుకుని అభినందించారు. మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజల కష్ట సుఖాలలో అండగా నిలవాలని సూచించారు. ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ గారిని ప్రత్యేకంగా అభినందించారు.