కాంట్ర‌వ‌ర్శీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా వుండే రాంగోపాల్ వ‌ర్మ త‌న‌కు న‌చ్చిన‌, న‌చ్చ‌ని వారిపై ట్వీట్లు చేస్తూ నెటిజ‌న్ల‌ను ఎట్రాక్ట్ చేస్తుంటాడ‌న్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి త‌న ట్వీట్ల‌తో ఆల‌జ‌డి సృష్టించాడు. “అరేయ్ జగన్‌గా” ఇట్టాంటి బ్లాక్‌బస్టర్లు తీసే దమ్ముండి కూడా ఎందుకు తియ్వవురా బాడ్‌కవ్” అంటూ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాద్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. పూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈనెల 18న రిలీజైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని చూసిన అనంత‌రం వ‌ర్మ ఈ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలంగాణలో స‌క్స‌స్ టాక్ తెచ్చుకుంది.