అలీ రెజా ఎవరూ ఊహించని విధంగా మొన్నటి ఆదివారం ఎలిమినేషన్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే. మొదటి సారి ఎలిమినేట్ రౌండ్ లోకి రావడం, ఇంటి నుంచి వెళ్లిపోవడం ఒక్కసారే జరిగిపోయింది. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఇంటి సభ్యులు ఎంతో ఎమోషన్ కి లోనయ్యారు. సొంత మనిషి తమ నుంచి విడిపోతున్నంత బాధతో కన్నీరు మున్నీరు అయ్యారు. వారి ఆప్యాయతకు దూరమైన అలీ ఎంతో బాధతో ఇంటికి పయనమయ్యాడు కానీ ఇంటికి వెళ్లిన తర్వాత మరో భయంకరమైన విషయాన్ని విని షాక్ తిన్నాడు. తాను బిగ్ బాస్ లో పాల్గొంటున్న సమయంలోనే తన మావయ్య చనిపోయాడని ఇంటికి వెళ్ళాక తెలిసిందని అలీ రెజా భావోద్వేగానికి గురయ్యాడు. అయితే బిగ్ బాస్ లో తాను గట్టి పోటీతో ఉండటం ఇలాంటి సమయంలో ఇలాంటి న్యూస్ వింటే నా మనోధైర్యాన్ని కోల్పోతానని ఇంటి సభ్యులు భావించారట. ఈ వార్త నాకు తెలిస్తే నేను బిగ్ బాస్ హౌస్ లో గేమ్ పై ఫోకస్ చేయలేనని మా తల్లిదండ్రులకు తెలుసు. అదే సమయంలో నా ఫ్యామిలీ కూడా నాకు చాలా ముఖ్యం అందుకే ఇంత పెద్ద విషాదాన్ని నాకు తెలియకుండా దాచారు. ఎలిమినట్ అయి షాక్ లో ఇంటికి వెళ్లిన నాకు ఈ వార్త మరింత బాధ కలిగించింది. నీ చివరి చూపుకు నోచుకోలేకపోయినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా “లవ్ యు ఫరెవర్” మావయ్య అని అలీ రెజా తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు…