హైదరాబాద్‌ లో దాదాపు 45 రోజుల తర్వాత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆయా రంగాలకు చెందిన వారు బయటకి వస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్‌ శాఖలతోపాటు నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగులు సైతం 33 శాతం మంది కార్యాలయాలకు వెళ్తున్నారు. 

నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు సైతం తెరచుకుంటున్నాయి. ఎలక్ట్రికల్, ప్లంబర్‌, సిమెంట్‌, స్టీల్‌ దుకాణాలు తెరవడంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే 35 శాతం వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాలు సైతం తెరుచుకోవడంతో నగర రోడ్లపై రద్దీ కనిపిస్తోంది.