17 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం కారణంగా ఓ 37 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. రైల్వే క్వాటర్స్ కాలనీలో మహిళతో శారీరక సంబంధం సాగించిన తరువాత ఆమెను నగ్నంగా చేసి నరాలు కట్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసు కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చెయ్యగా దిమ్మతిరిగే విషయాలు వెలుగు చేశారు. 37 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న 17 బాలుడిని ఆమె రివర్స్ లో బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అతనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. నన్నే బ్లాక్ మెయిల్ చేస్తోందా? అందుకే అంతు చూశాను అంటూ బాలుడు చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

పండగ రోజు హత్య:

తమిళనాడులోని విల్లుపురం దక్షిణ రైల్వే కాలనీలో గత జనవరి 14వ తేదీ 37 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. మహిళ శరీరం మీద ఎలాంటి డ్రెస్ లేకపోవడం, ఆమె శరీరంలోని నరాలు కట్ చెయ్యడంతో మొత్తం గాయాలు కావడంతో అటువైపు వెళ్లిన వారు విషయం గుర్తించి గట్టిగా కేకలు వేసి అక్కడి నుంచి పరుగు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మహిళతో శారీరక సుఖం అనుభవించిన తరువాత ఆమె తల తదితర చోట్ల నరాలు కట్ చేసి అత్యంత కిరాతకంగా బండరాయితో దాడి చేసి హత్య చేశారని, రాళ్ల దాడితో శరీరం మొత్తం గాయాలైనాయని ప్రభుత్వ వైద్యుల నివేదికలో వెలుగు చూసింది.

కుర్రాడితో ఆంటీకి లింక్:

హత్యకు గురైన మహిళ అదే రోజు రాత్రి 17 ఏళ్ల బాలుడితో ఆ ప్రాంతంలో తిరిగిందని స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విల్లుపురం దక్షిణ రైల్వే కాలనీలో చాల వరకు పాడుపడిన ఇండ్లు ఉన్నాయి. అదే రైల్వే కాలనీలోని పాడుపడిన ఇండ్ల దగ్గర అర్దరాత్రి 17 ఏళ్ల బాలుడు, ఓ మహిళ తిరుగిన విషయం తాము చూశామని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే కాలనీ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. హత్యకు గురైన మహిళతో తాను సహజీవనం చేస్తున్నానని బాలుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. గత నెల 14వ తేదీ రాత్రి తాను ఆమె పాడుపడిన రైల్వే కాలనీలోని ఇంటిలో రాత్రి 11 నుంచి వేకువ జామున వరకు శారీరకంగా కలిశామని బాలుడు పోలీసులకు చెప్పాడు.

ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే.?:

తనతో శారీరక సుఖం అనుభవించిన తరువాత ఆ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పిందని, తన దగ్గర ఉన్న డబ్బులు అప్పుడే ఇచ్చానని బాలుడు పోలీసులకు చెప్పాడు. అయితే తనకు ఇంకా డబ్బలు ఇవ్వాలని, లేదంటే తనను రేప్ చేశావని మీ తల్లిదండ్రులకు, పోలీసులకు చెబుతానని ఆమె బెదిరించిందని, భయంతో బండరాయి తీసుకుని ఆమె తలమీద దాడి చేసి నరాలు కట్ చేసి చంపేశానని బాలుడు పోలీసులకు చెప్పారు.

రివర్స్ బ్లాక్ మెయిల్ చేస్తుందా ? అందుకే లేపేశాను:

శారీరక సుఖం కోసం ఆమె శరీరం మీద బట్టలు మొత్తం తీసేసిన బాలుడు అదే స్థితిలో ఉన్న ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు బాలుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. బాలుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి అతన్ని రిమాండ్ హోమ్ కు తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు రిమాండ్ హోమ్ లో బాలనేరస్తుడిగా శిక్ష అనుభవిస్తున్నాడు. విల్లుపురంలో అక్రమ సంబంధం కారణంగా వివాహిత మహిళను 17 ఏళ్ల బాలుడు హత్య చెయ్యడం 2020లో కలకం రేపింది.