వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళలు, విద్యార్థులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేసే షీ టీంతో కలిసి ఆకతాయిల భరతం పట్టాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మహిళలు విద్యార్థులకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న షీ టీం విభాగాలపై యువతులకు అవగాహన కల్పించడం కోసం నూతనంగా రూపోందించబడిన వాల్‌ పోస్టర్లను ఆదివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ షీ టీం విభాగంపై మహిళలకు మరింత అవగాహన కల్పించడం కోసం నూతనంగా రూపోందించబడిన వాల్‌ పోస్టర్లను నగరంలోని ప్రధాన కూడళ్ళు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్లు, సినిమాథియేటర్లు, కాలేజీలతో పాటు రద్దీ ప్రాంతాల్లో ఈ వాల్‌ పోస్టర్లును ఏర్పాటు చేయడం జరుగుతుందని. దీనితో షీ టీం విభాగలతో మహిళా కళాశాలల్లోను ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయబడుతున్నాయని.

మహిళల భద్రత కోసం ఏర్పాటయిన, ఈ విభాగం అధికారులు, సిబ్బంది అన్ని ప్రదేశాల్లో నిఘా కోనసాగిస్తారని. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల పట్ల ఏవరైనా లైంగిక వేధింపులు, ఈవీటీజింగ్‌ చర్యలకు పాల్పడిన తక్షణమే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వాట్సప్‌ నెంబర్‌ 9491089257 లేదా డయల్‌ 100కు సమాచారం ఆందించాలన్నారు.