కమిషనర్ ఆఫ్ పోలీసు, వరంగల్ డా. వి. రవీందర్, IPS గారి ఆదేశాల మేరకు ఈ రోజు అనగా ఆదివారం వరంగల్ పోలీసు కమిషనరేట్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో హన్మకొండ ట్రాఫిక్ పోలీసుల ఆద్వర్యం లో ఆటో డ్రైవర్స్ మరియు మైనర్ లకు అవగాహన సదస్సు నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిది గా ట్రాఫిక్ ACP MD మజీద్ గారు మాట్లాడుతూ ఆటో డ్రైవరు లకు మరియు మైనర్ లకు రోడ్డు బద్రత గురించి, రోడ్డు పై పాటించాల్సిన నియమాలను, ముఖ్యంగా చిన్న పిల్లలకు వాహనాలను ఇవ్వడం ద్వారా ఎలాంటి పరిణామాల ఎదురవుతాయి, తెలిసీ తెలియని వయసులో వాహనం ద్వారా ఎదురయ్యే సమస్యలను అదిగమించే పరిణితి ఉండదని, వారి వయసు ద్వారా వచ్చే అనుభూతితో అలా అతి స్పీడ్ గా నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్న సంగటనలను ఉదాహరణల ద్వారా వివరించడం జరిగింది.

ఆటో డ్రైవరు లకు వారు పాటించవలసిన ప్రధానమైన ముఖ్యమైన కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆటొ డ్రైవరులు వారి ఆటో స్టాండ్ లలో ప్రజలకు ఇబ్బంది కలుగ కుండ ఆటో లు పార్క్ చేస్తూ, అవసరాన్ని బట్టి మాత్రమే రోడ్డు పైకి తీయాలి, చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నా స్టాండ్ లు పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను బట్టి వాటిని ప్రజలకు ఇబ్బంది లేని స్తలాలకు మార్చుకోవాలి. ఆటొ ఫిట్నెస్ చూసుకోవాలి, పొగ ద్వారా పొల్యూషన్ వచ్చే ఆటొలను నడపవద్దు, పరిమితికి మించి ఆటోలలో ఎక్కించుకొని నడపరాదు, ముఖ్యంగా స్కూల్ పిల్లలను పరిమితికి మించి ఎక్కించుకోరాదు, ఆటో డ్రైవరు కు వెనుక వాహనాలు కనిపించుటకు ఆటో వెనుక ఎలాంటి ప్రకటనల పోస్టర్లు అంటించరాదు. వరంగల్ సిటి అంతా ప్రయాణికుల దగ్గర ఒకే విదంగా ఆటొ ఛార్జీలు తీసుకోవాలి, చార్జీల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద ఫ్రీ లెఫ్ట్ లను జామ్ చేయరాదు, ఆటో లకు కేటాయించబడిన రెండవ లైన్ లో మాత్రమే ఆటొను నడపాలి, ఆటొలను అతివేగంగా మరియు త్రాగి నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు అని ట్రాఫిక్ ACP గారు సూచించారు.