ఒక ఆటో డ్రైవర్ IT కారిడార్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ సమీపానికి రాగానే తన ఆటోను పక్కకు ఆపాడు. వెనుక నంబర్ కనిపించకుండా నంబర్ ప్లేట్‌ను ఒక వైపు వంపాడు. సిగ్నల్ దాటిన తర్వాత తిరిగి నంబర్ ప్లేట్‌ను సరిచేసుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో సిగ్నల్ వద్దకు రాగానే మళ్లీ అదే పని చేశాడు. రోజూ ఇదే రీతిన సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు. పోలీసులకు నంబర్ ప్లేట్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ చలానాలు తప్పించుకుంటున్నాడు. ఆటోడ్రైవర్ అతి తెలివిని CC కెమెరాల్లో గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతనిపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులతోపాటు, ఉద్ధేశ్యపూర్వకంగానే తప్పు చేశాడని నిర్ధారించి క్రిమినల్ కేసు నమోదు చేశారు…