పసికందు అన్న కనికరం లేకుండా 20 రోజుల ఆడపాపను చెట్ల పొదల్లో వదిలివెళ్లారు. నాచారంలోని ప్రసాద్‌ దవాఖాన ఎదురుగా పార్కింగ్‌ ప్రాంతంలోని చెట్ల పొదల్లో శిశువు ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు 20 రోజుల ఆ పసిపాపను అమీర్‌పేట్‌లోని శిశువిహార్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపారు.