బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన మరవకముందే, మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. మరాఠీ నటుడు అశుతోష్ భక్రే ఉరివేసుకొని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందెడ్‌లో అశుతోష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అశుతోష్ భక్రే.. భకార్, ఇచర్ థార్లా పక్కా వంటి పలుచిత్రాల్లో నటించాడు. ఆయన భార్య మయూరి దేశ్ ముఖ్ పలు మరాఠీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఐతే అశుతోష్ భక్రే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది తెలియాల్సి ఉన్నది. కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని.. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని సన్నిహితులు భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.