పోలీస్‌ కమినషరేట్‌ సి.సి.ఆర్.బి విభాగంలో విధులు నిర్వహిస్తు అనారోగ్య కారణాలతో మరణించిన కానిస్టేబుల్ జె. ప్రసాద్ కుటుంబానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పి. ప్రమోద్ కుమార్ చేతుల మీదుగా చేయూత పధకం క్రింద లక్షన్నర రూపాయల తక్షణ ఆర్థిక సాయం క్రింద మరణించిన కానిస్టేబుల్ సతీమణి రజిత కి అందజేసారు. ఈ సందర్బంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ స్థితి పరిస్థితులపై పోలీసు కమిషనర్‌ అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ పరం అందాల్సిన భెన్‌పిట్స్‌ను తక్షణమే అందే విధంగా పర్యవేక్షించాల్సిందిగా పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ గౌడ్‌కు కమిషనర్‌ సూచించారు.