కోయంబత్తూర్ సుందరాపురంలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. సుందరాపురంలో తల్లి మృతిచెందడంతో 11 ఏళ్ల బాలిక తండ్రి వద్ద ఉంటోంది. తండ్రి కూలీపనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉండే బాలిక.. కింది ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్తుండేది. ఆ ఇంట్లో ఉంటున్న 10వ తరగతి చదువుతున్న కుమారుడికి తల్లిదండ్రులు ఆన్‌లైన్ తరగతుల కోసం స్మార్ట్ ఫోన్ అందజేశారు. దీంతో ఆ విద్యార్థి. తన స్నేహితుడైన ప్లస్ వన్ విద్యార్థిని ఇంటికి పిలిపించుకొని ఇద్దరూ సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు వీక్షించేవారు. ఈ నేపథ్యంలో గత మే 20వ తేది టీవీ చూసేందుకు వచ్చిన బాలికకు ఇద్దరు అశ్లీల చిత్రాలు చూపించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమ స్నేహితుడైన మరో ప్లస్ వన్ విద్యార్థిని పిలిపించి ముగ్గురు మరోసారి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తర్వాత కూడా బాలికను బెదిరించిన ముగ్గురూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవారు. శనివారం అనారోగ్యానికి గురైన బాలికను తండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, బాలిక అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. బాధిత బాలిక ఫిర్యాదుతో కోవై నార్త్ మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు.