ఆన్ లైన్ డేటింగ్ పేరుతో యువతీ యువకుల్ని మోసం చేస్తూ వారిని ముగ్గులోకి దింపి, ఆ తర్వాత వాయిస్ రికార్డ్ లతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ ముఠాని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేలమందిని వారు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజినట్టు తెలిపారు. చక్కటి గొంతు ఉన్న అమ్మాయిలను టెలికాలర్స్ ఉద్యోగాలిప్పిస్తామంటూ వారిని కంపెనీలో చేర్చుకుని, చివరకు ఇలాంటి పనులు చేయిస్తున్నారు. ముగ్గురు నిర్వాహకులతోపాటు, 20మంది ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.